నంద్యాల సలాం కుటుంబ ఆత్మహత్యపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, వైసీపీలు ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీని మతతవ్వ రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారని… మరీ ఇవి మత రాజకీయాలు కావా అని ఆయన ప్రశ్నించారు.
నంద్యాల ఆత్మహత్య కేసులో పోలీసులను అరెస్ట్ చేయటం సరికాదని, డ్యూటీ చేసిన పోలీసుల్ని అరెస్ట్ చేయటం ఏంటని సోము వీర్రాజు ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే సీఎంను కూడా అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీలో అక్రమాలు ప్రశ్నిస్తే తమపై హిందుత్వ ముద్ర వేస్తున్నారని… వారు చేసేవి మత రాజకీయాలు కావా అని ప్రశ్నించారు.
నంద్యాలలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న సలాంను నంద్యాల పోలీసులు దొంగతనం కేసులో వేధిస్తున్నారని సలాం కుటుంబ సభ్యులతో కలిసి సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకోవటం రాష్ట్రంలో కలకలం రేపింది. ఆ కేసులో నంద్యాల సీఐ, హెడ్ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేయగా మరుసటి రోజే వారు బెయిల్ పై విడుదలయ్యారు.