కన్నా లక్ష్మి నారాయణ, బీజేపీ నేత
వైసీపీ ప్రభుత్వం వచ్చాక హిందూ మతం మీద, హిందూ దేవుళ్లపై దాడులు జరుగుతున్నాయి. 150కి పైగా ఘటనలు జరిగినా ఒక్కరిని అరెస్ట్ చేసిన దాఖలాలు లేవు. వినాయక చవితిని ఇంట్లోనే జరుపుకోండని ప్రభుత్వం జీవో ఇవ్వడాన్ని ఖండిస్తున్నాం. సినిమాహాళ్లు, స్కూళ్లు, బార్లకు లేని కోవిడ్ ఆంక్షలు వినాయక ఉత్సవానికే ఎందుకు. గవర్నర్ జోక్యం చేసుకొని వినాయకచవితి జరుపుకొనేలా అనుమతినివ్వాలని కోరాం.
మొహర్రం, వైఎస్ వర్ధంతి, నామినేటెడ్ పదవుల సభలకు అనుమతించినట్టే తమకు 50 మందితో అనుమతినివ్వమని కోరుతున్నాం. గత సంవత్సరం అడగలేదని.. ప్రస్తుతం కేసులు తగ్గాయి కాబట్టే డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా పండుగను జరిపి తీరుతాం.