విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ ప్రధాన కార్యదర్శి
టిప్పు సుల్తాన్ మహనీయుడు విగ్రహం పెడితే తప్పేంటని ప్రశ్నించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా… ఇస్లాం మతం విగ్రహారాధనకు వ్యతిరేకం కదా..? మరి.. మీరు విగ్రహం పెట్టటాన్ని ఎందుకు సమర్ధిస్తున్నారు..? మీరు ఆచరిస్తున్న మత విశ్వాసాలపై మీకే నమ్మకం లేదా..? మా బీజేపీలో మైనారిటీలు.. అంటే ముస్లింలు, క్రిస్టియన్ పెద్ద ఉన్నారు. వారికంటూ మైనారిటీ మోర్చా కూడా ఉంది. కేంద్రం మొదలుకొని, మేము అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో మైనారిటీలు మంత్రులుగా ఉన్నారు.
ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నదని ఎవరు..? ఆదాయం లేని చర్చిలు, మసీదులను సర్కార్ సొమ్ముతో కట్టిస్తున్న మీరు.. ప్రభుత్వానికి ఆదాయం ఇస్తున్న దేవాలయాలను ఎందుకు కట్టించుకోరు..? గోమాతపై దుర్మార్గ పూరిత వ్యాఖ్యలు చేసిన మీ వైసీపీ నాయకులను ఏమనాలి..? ఇప్పుడు చెప్పండి.. ఎవరిది మతతత్వ పార్టీ..? ఎవరు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది..?