ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరవుతుండటంతో అన్ని పార్టీ గెలుపు కోసం సన్నాహాలు చేస్తున్నాయి. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ భేటీ అయ్యారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ణాలని, జనసేనతో పొత్తు కారణంగా అనుసరించాల్సిన వ్యూహం పై చర్చించినట్టు సమాచారం.
మోడీ పాలన, కేంద్రం అమలు చేస్తున్న పధకాలు గ్రామాలలో ప్రచారం చేయాలని సూచనలు చేశారు. ఎనిమిది నెలల జగన్మోహన్ రెడ్డి పాలనలో వైఫల్యాలు, పెన్షన్ ల రద్దు వంటి అంశాలను ప్రజలకు వివరించాలని, స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపుకు అవకాశం ఉన్న గ్రామాల పై ప్రత్యేక దృష్టి సారించాలని కన్నా సూచించారు. ఈ కార్యక్రమంలో పురందేశ్వరి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.