అమరావతిని రాజధానిగా కొనసాగించాలని బీజేపీ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత అభిప్రాయాలు పక్కకుపెట్టి పార్టీ నిర్ణయం మేరకు నేతలంతా మాట్లాడాలని నిర్ణయించారు. అవసరమైతే అమరావతి కోసం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలనే విషయంలో కేంద్రం జోక్యంపై రాష్ట్ర బీజేపీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. గుంటూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఈ విషయమై పార్టీ నేతలు సుదీర్ఘంగా చర్చించారు.