ఏపీ బీజేపీ కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. ఇటీవలే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు తన టీంను రెడీ చేసుకున్నారు. 10 మందికి ఉపాధ్యక్షులుగా, 10 మంది కార్యదర్శులు, ఐదుగురికి ప్రధాన కార్యదర్శులుగా అవకాశం ఇచ్చారు. మొత్తం 40 మందితో కొత్తకమిటీని ప్రకటించారు.
రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులుగా రేలంగి శ్రీదేవి, కాకు విజయలక్ష్మీ, మాలతీరాణి, నిమ్మక జయరాజు, వేణుగోపాల్, విష్ణుకుమార్‌రాజు, ఆదినారాయణరెడ్డి, వేణుగోపాల్, రావెల, సురేందర్‌రెడ్డి, చంద్రమౌలిని నియమించారు.
ఇక ప్రధాన కార్యదర్శులుగా పీవీఎన్ మాధవ్, విష్ణువర్దన్‌రెడ్డి, లోకులగాంధీ, సూర్యనారాయణ రాజు, మధుకర్‌కు బాధ్యతలు అప్పించారు. మిగిలిన టీం సభ్యుల వివరాలు కింద చూడొచ్చు.