ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం ఉదయం బడ్జెట్ పద్దును ప్రవేశపెట్టారు.ఈ ఏడాది 2,79,279 కోట్ల భారీ బడ్జెట్ ను వైసీపీ సర్కారు ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో మంత్రి బుగ్గన బడ్జెట్ పై ప్రసంగించారు. ఈ బడ్జెట్ లో వివిధ శాఖలు, సంక్షేమ పథకాలకు జరిపిన కేటాయింపులను మంత్రి వివరించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది.
ఇక ఏపీ బడ్జెట్ 2023-24 హైలైట్స్ విషయానికొస్తే..జగనన్న విద్యా కానుకకు రూ.560 కోట్లు, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు రూ.9,381 కోట్లు, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం రూ.1,166 కోట్లు, లా నేస్తానికి రూ.17 కోట్లు,యువజన అభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతి శాఖకు రూ.1,291 కోట్లు, షెడ్యూలు కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు,వైఎస్ఆర్ కల్యాణ మస్తు పథకానికి రూ.200 కోట్లు కేటాయించడం జరిగింది.
అదే విధంగా వైఎస్‌ఆర్ ఆసరా పథకానికి రూ.6,700 కోట్లు, షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ.6,929 కోట్లు,వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు, వైఎస్ఆర్ చేయూత పథకానికి గాను రూ.5వేల కోట్లు,అమ్మ ఒడికి రూ.6,500 కోట్లు,మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు,ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3 వేల కోట్లు,వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1,212 కోట్లు కేటాయించారు.
ఇక వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం రూ.15,882 కోట్లు, కాపు సంక్షేమం కోసం రూ.4,887 కోట్లు, మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు,మన బడి నాడు నేడు పథకానికి రూ.3,500 కోట్లు, పేదలందరికీ ఇళ్ల కోసం రూ.5,600 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యానికి రూ.2,602 కోట్లు,రోడ్లు, భవనాలు శాఖకు రూ.9,118 కోట్లు,నీటి వనరుల అభివృద్దికి రూ.11,908 కోట్లు.. మొత్తానికి 2 లక్షల 79 వేల 279 కోట్లతో ఏపీ 2023-24 వార్షిక బడ్జెట్ ను ఏపీ సర్కార్ రూపొందించడం జరిగింది.