రాజధాని తరలింపు విషయంలో అమరావతి రైతుల అభిప్రాయాలు తెలిపేందుకు గడువు కోరుతూ రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే తుళ్లూరు సీఆర్డీయే కార్యాలయానికి 27 ఫిర్యాదులు అందగా… మరింత సమయం కోరటంతో సోమవరాం మద్యాహ్నం 2.30గంటల వరకు కోర్టు గడువు ఇచ్చింది.
మరోవైపు రాజధాని అంశంపై ఏర్పాటైన మంత్రుల హైపవర్ కమిటీ రైతుల నుండి సలహాలు, సూచనలు, అభ్యంతరాలను కోరింది. అయితే… రాజధాని అంశంపై శనివారం మద్యాహ్నం ఏపీ క్యాబినెట్ సమావేశం కాబోతుంది. ఈ నెల 20న ఉదయం అసెంబ్లీ సమావేశానికి ముందు నిర్వహించాలని ముందుగా అనుకున్నా రెండు రోజులు ముందుగానే రాజధాని అంశంపై క్యాబినెట్ భేటీ కాబోతుంది.
రాజధాని ప్రాంత రైతులు, అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు సహయం సహా మూడు రాజధానుల అంశంపై క్యాబినెట్ హై పవర్ కమిటీ నివేదికపై చర్చించబోతుంది.