ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు నాలుగు గంటలపాటు కొనసాగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.జనవరి 26 నుంచి అమ్మఒడి పథకం అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.గిరిజన ప్రాంతాల్లో ఉండేపిల్లలకు పౌష్ఠిక ఆహరం అందించాలన్న నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడి కి జగ్గయ్యపేటలో గత ప్రభుత్వం కేటాయించిన 498 ఎకరాల భూకేటాయింపులు, వైజాగ్ లో లులు గ్రూప్ కు కేటాయించిన 13.83 ఎకరాలు(1500కోట్లు)విలువ చేసే భూమిని రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.