గుంటూరు: కోడెల మృతదేహం పక్కన పెట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాాలు మాట్లాడుతుంటే అసలు మనిషేనా అనే అనుమానం కలుగుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ జీ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోడెలను చంద్రబాబు మానసికంగా వేధించడం వలనే చనిపోయారని కొత్త ఆరోపణ చేశారు. మాజీ స్పీకర్ కోడెల మరణం బాధాకరమని అంటూ.. శవ రాజకీయాలు చేయడం మాకు తెలియదని అన్నారు. ‘కోడెల బ్రతికి ఉన్నప్పుడు హింసిస్తారు.. చనిపోయిన తర్వాత శవ రాజకీయాలు చేస్తారు..’ అని తీవ్ర విమర్శ చేశారు. శ్రీకాంత్ ఏమన్నారంటే…
ఎన్టీఆర్ బతికి ఉన్న సమయంలోను మానసిక వేదనకు గురిచేసి ఆయన శవం పక్కన రాజకీయాలు చేశారు..
హరికృష్ణ, లాల్ జాన్ బాషా విషయంలో చంద్రబాబు అలానే చేశారు..
బతికి ఉండగా కోడెలను మానసిక వేదనకు గురిచేశారు..
కోడెల గతంలో ఆత్మహత్య ప్రయత్నం చేస్తే కనీసం చంద్రబాబు పరామర్శించలేదు..
శవ రాజకీయాలతో ప్రజల్ని రెచ్చకొట్టే ప్రయత్నం చేస్తున్నారు..
గతంలో వర్ల రామయ్య కోడెలపై తీవ్ర విమర్శలు చేశారు..
కోడెల వలన పార్టీ భ్రష్టు పట్టి పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు..
కోడెల ఫర్నిచర్ దొంగలించడం తప్పు అని వర్ల రామయ్య మాట్లాడారు..
కోడెల ఆత్మహత్యపై అనేక రకాలుగా మాట్లాడుతున్నారు..
ఒకరు తాడుతో, అంటే మరొకరు లుంగీతో అని, మరికొందరు మందు వికటించిందని, ఇంకొకరు గుండెపోటు అని మాట్లాడుతున్నారు..
కోడెల ఆత్మహత్యకు వైస్సార్సీపీకి ఏమి సంబంధం..
కోడెలపై కేసులు పెట్టింది టీడీపీ నాయకులే..
వైస్సార్సీపీ నాయకులను నరికి చంపిన ఘనత టీడీపీది..
శవ యాత్రలు శవ రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం.
వైఎస్ రాజారెడ్డి, చెరుకులపాడు నారాయణరెడ్డిని చంపిన హంతకులను మీ ఇంట్లో పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుది..
కోడెల.. కొడుకు, కుమార్తె వలన చనిపోయారని వర్ల రామయ్య స్వయంగా తెలిపారు..
ఛలో ఆత్మకూరు చేపట్టినప్పుడు కోడెలను ఎందుకు చంద్రబాబు పిలవలేదు..
పార్టీ మీటింగ్‌లకు కోడెలను చంద్రబాబు ఆహ్వానించలేదు..
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయకుండా కోడెల క్యారెక్టర్ ను కించపరిచింది చంద్రబాబు కాదా..
చంద్రబాబు కళ్ళలో నుంచి నీళ్లు తెప్పించడానికి ఎల్లో మీడియా ఎంతో ప్రయత్నం చేస్తోంది..
అచ్చెన్నాయుడు ఉద్యోగులను యూజ్‌లెస్ ఫెలో అంటే కేస్ పెట్టారా..
టీడీపీ నేతలు దళితులను కులం పేరుతో తిడితే కేస్ పెట్టారా..
చంద్రబాబు పద్ధతి మార్చుకోకపోతే చరిత్ర హీనుడిగా మిగిలిపోతావు..
కోడెల చనిపోయిన తరువాత ఐదు ఆరు గంటలకు వరకు చంద్రబాబు మాట్లాడలేదు..
చంద్రబాబు మానసిక క్షోభపై కోడెల ఏమైనా లెటర్ రాశారా అని పదే పదే అడిగారు..
కోడెల ఎలాంటి లెటర్ రాయలేదని తెలిసిన తరువాత చంద్రబాబు రాజకీయ డ్రామా మొదలు పెట్టారు..