ఏపీ సర్కార్‌కు వ్యతిరేకంగా పోస్టు పెట్టిందనే కారణంగా 60 ఏళ్ళ వృద్దురాలిపై సీఐడీ అధికారులు సోషల్ మీడియా కేసు నమోదు చేశారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ ఘటనపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్ష్మీపురంకు చెందిన పూందోట రంగనాయకమ్మ(60) పోస్ట్ పెట్టింది. దీంతో సీఐడీ అధికారులు ఆమెపై కేసు cr no 24/2020, U/S 505(2), 153 (A), 188, 120(B), rw 34 IPC sections 67 of it Act 2008 ను క్రింద్ర నమోదు చేసి… 41-A నోటీసును అందజేశారు. ఈ కేసు నేరం రుజువైతే మూడేళ్ళు జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. వృద్ధురాలిపై సోషల్ పోస్టుల కేసు నమోదుపై నగరవాసులు విస్మయం చెందుతున్నారు.