మాజీ మంత్రి నారాయణ కార్యాలయంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్విహించారు. మాదాపూర్‌లోని మెలాంజ్ పూర్ లోని ఆయన కార్యాలయంలో సీఐడీ అధికారులు తనిఖీలు చేశారు. నారాయణ సంస్థల నుంచి వచ్చిన డబ్బును ఆయన దారి మళ్లించి ఓ హౌసింగ్ సంస్థలోకి నిధులు మల్లించారని ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఆరోపణల మేరకు సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అమరావతి రాజధాని ఇన్నరింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పుల చేశారంటూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని సీఐడీ దర్యాప్తు ప్రారంభించింది.
కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు తోపాటు మాజీ మంత్రి నారాయణలపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, నారాయణను ఏ-2గా కేసులు నమోదు చేసింది. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. 2014–19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ క్రమంలో గతంలో నారాయణకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిపై నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని నారాయణ నివాసంలోనే ఆయన్ని ప్రశ్నించాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఇటీవల ఆయన ఇంట్లోనే అధికారులు నారాయణ స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు.