అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిన మేఘా సంస్థకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వరుస సాగునీటి ప్రాజెక్టులను రివర్స్ టెండరింగ్ లో కట్టబెట్టడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టు ల్లో అవినీతి కి పాల్పడిందని, రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వ ఆదాయాన్ని ఆదా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అంతా బాగానే ఉన్నా… రివర్స్ టెండరింగ్ పేరుతో మేఘా కృష్ణా రెడ్డి సంస్థకు అన్ని ప్రాజెక్టులు కట్టబెట్టడం పై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
రివర్స్ టెండరింగ్ పేరుతో తాము అనుకున్న వ్యక్తులకు ప్రాజెక్ట్ లు కట్టబెడుతున్నరని విమర్శిస్తున్నారు.
వెలిగొండ రెండో టన్నెల్ పనులు టెండర్ల ప్రక్రియ లో అవకతవకలు జరిగాయని నిపుణుల కమిటీ నిర్ధారించింద ని రివర్స్ టెండరింగ్ కి వెళ్లినజగన్ ప్రభుత్వం, 553.13 కోట్ల టెండర్ ను 7 శాతం లెస్తో మేఘ సంస్థకు ప్రాజెక్టును కట్టబెట్టింది.86 కోట్ల కు పైగా ప్రభుత్వ సొమ్మును ఆదా చేశామని ప్రభుత్వం చెబుతోంది.పోలవరం ప్రాజెక్టు కూడా తక్కువ ధరకు కోట్ చేసి మేఘా దక్కించుకున్నారు.
మేఘా సంస్థలపై ఐటి శాఖ దేశ చరిత్రలోనే వరుసగా ఆరు రోజుల పాటు దాడులు చేసి వేల కోట్ల అక్రమ ఆస్తులు గుర్తించినట్లు తెలుస్తోంది.ఐటి శాఖ ఇప్పటికే అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. కోట్ల రూపాయల లెక్క చూపని డబ్బును, ఆస్తులను సీజ్ చేశామని ప్రకటించింది.ఈడి కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనీ లాండరింగ్, హవాలా అక్రమాలు ఉన్నట్టు ఐటి స్పష్టం చేస్తోంది కాబట్టి మేఘా అరెస్ట్ ఖాయమంటున్నారు చాలా మంది.
మరి ఇలాంటి వ్యక్తికి ,సంస్థకు ప్రాజెక్టులు కట్టబెట్టడం ఏంటని ప్రజలు అడుగుతున్నారు.