టాలీవుడ్ పెద్దలకు ఏపీ సీఎం జగన్ మరోసారి ఝలక్ ఇచ్చారు. ఇప్పటికే పలుసార్లు టాలీవుడ్ పెద్దలతో సీఎం జగన్ మీటింగ్ రద్దు కాగా… తాజాగా సోమవారం జరగాల్సి ఉన్న మీటింగ్ కూడా రద్దైనట్లు తెలుస్తోంది.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో టికెట్లను ఆన్ లైన్ లో అమ్మేందుకు కొత్త వెబ్ సైట్ ప్లానింగ్ లో ఉంది. ఇది నిర్మాతలకు ఇబ్బందిగా టాలీవుడ్ పెద్దలు భావిస్తున్నారు. కానీ దీనిపై డిస్ట్రిబ్యూటర్స్, ఎక్సిబిటర్స్ తో ఏపీ ఫిల్మ్ కార్పోరేషన్ బోర్డు సమావేశం అవుతుంది. ఈ సమావేశం తర్వాత పోర్టల్ పై ఓ క్లారిటీ వచ్చాక మాత్రమే సీఎం జగన్ సినీ పెద్దలతో సమావేశం కాబోతున్నట్లు సీఎంవో వర్గాలంటున్నాయి.
ఏపీలో ఉన్న అనిశ్చితి కారణంగా కొత్త సినిమాల రిలీజ్ పై ఎటూ తేలటం లేదు. సీఎంతో టాలీవుడ్ పెద్దల భేటీ వరుసగా వాయిదా పడుతుండటంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.