ఎన్.ఆర్.సి (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) పై ఏపీ సీఎం ఎట్టకేలకు నోరు విప్పారు. ఎన్.ఆర్.సి ని తమ రాష్ట్రంలో అమలు చేయమని స్పష్టం చేశారు. సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ బిల్లుకు అనుకూలంగా పార్లమెంట్ లో ఓటు వేసిన జగన్ ఆ తర్వాత దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండడంతో ఎన్.ఆర్.సి వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. ముస్లిం సోదరులు ఎన్.ఆర్.సి పై తన వైఖరిని అడిగారని..తాను ఎన్.ఆర్.సి కి వ్యతిరేకమని చెప్పానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్.ఆర్.సి ని అమలు చేయదని డిప్యూటీ ముఖ్యమంత్రి అజ్మత్ భాషా తనను సంప్రదించాకే ప్రకటించారని చెప్పారు.
ఎన్.ఆర్.సి.ని అమలు చేయమని చెప్పిన రాష్ట్రాల్లో ఇప్పుడు తాజాగా ఏపీ చేరింది. ఏపీ ఎన్.ఆర్.సి పై ప్రకటన చేయడంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఒత్తిడి పెరిగినట్టయ్యింది. ఆయన కూడా దీని మీద ఏదో ఒక ప్రకటన చేయాల్సిందే. కాంగ్రెస్ ఇప్పటికే డెడ్ లైన్ విధించింది.