ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు మరోసారి విచారించింది. పెన్నా, రఘురాం సిమెంట్స్ కేసుల్లో అభియోగాల నమోదుపై విచారణ రేపటికి వాయిదా పడింది. ఇటు ఓబుళాపురం గనుల కేసు విచారణ ఈనెల 16కి వాయిదా వేసిన సీబీఐ కోర్టు… ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది.
ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ పై విచారణ ఈనెల 16కి వాయిదా పడగా, విదేశాలకు వెళ్లేలా బెయిల్ షరతులు సడలించాలని పారిశ్రామికవెత్త నిమ్మగడ్డ ప్రసాద్ కోర్టును కోరారు. నిమ్మగడ్డ ప్రసాద్ అభ్యర్థనపై కౌంటరు దాఖలు చేసిన సీబీఐ, నిర్ణయం రేపటికి వాయిదా వేసింది.