ఈ మధ్య ఒక విషయం గమనించారా.. కోర్టుల మీద, జడ్జిల మీద యుద్ధం ప్రకటించిన వైసీపీ నేతలు జగన్, విజయసాయిరెడ్డిలతో సహా అందరూ సైలెంట్ అయిపోయారు. ఒక్కరంటే ఒక్కరు కూడా కోర్టు ధిక్కార కామెంట్స్ అనేవి చేయటమే లేదు. అటార్నీ జనరల్ లేఖ రాసినా.. ఇంకేం జరిగినా.. ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. కేవలం కొందరు మేధావులతోనే మాట్లాడిస్తున్నారు. ఈ పరిణామానికి కారణమేంటంటే.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి.. మీడియాకు రిలీజ్ చేయడం.. కోర్టు ధిక్కారం కిందకే వస్తుందనే సమాచారం వారికి అందింది. అప్పటి నుంచి టెన్షన్ లో పడ్డారు. ఎందుకంటే కోర్టు ధిక్కారం అని కన్ ఫామ్ చేశారంటే.. ముందు జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దవుతుంది. జగన్ సీఎం పదవికి.. విజయసాయిరెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేసి జైల్లోకి వెళ్లాల్సిన పరిస్ధితి వస్తుంది. అందుకే వారికి భయం పట్టుకుంది.
ఇప్పుడు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రేపో మాపో కోర్టు ధిక్కార పిటిషన్ పై నోటీసులొస్తాయని.. జగన్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని ఎంపీ అభిప్రాయపడ్డారు. తనకున్న సమాచారం మేరకే పక్కాగా చెబుతున్నానని నొక్కి మరీ చెప్పారు. అంటే ఇప్పుడు జగన్, విజయసాయిరెడ్డిలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సుఖం లేదు.. ఆల్రెడీ చేయాల్సిన తప్పులు చేసేశారు. వాటికి మూల్యం చెల్లించుకోవాల్సిందేనన్న కామెంట్లు వినపడుతున్నాయి. అందుకే పోలవరం గాని,, ఇంకో విషయం గాని.. అన్నిటిలోనూ కేంద్రం ఏం చెబితే దానికి తలూపుతూ.. తమకు మాత్రం కోర్టుల నుంచి సమస్య లేకుండా చూడమని వేడుకుంటున్నట్లు సమాచారం.
అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్ లేఖ రాసిన రోజు నుంచి ఈ మార్పు బాగా కనపడుతోంది. వేణుగోపాల్ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పారు. అసలైతే లేఖ రాయడం తప్పు కాదు.. కాని లేఖను మీడియాకు రిలీజ్ చేయడం మాత్రం కోర్టు ధిక్కారమని చాలామంది భావించారు. కాని లేఖలో రాసిన విషయాలను చదివితే.. లేఖ సైతం కోర్టు ధిక్కారం కిందే వస్తుందని వేణుగోపాల్ తన లేఖలో క్లారిటీ ఇచ్చారు. దానిపై జగన్ అండ్ కో న్యాయనిపుణులను సంప్రదించగా.. అది నిజమేనని వారికి తేలినట్లు చెప్పుకుంటున్నారు. అందుకే అప్పటి నుంచే కోర్టులపై గమ్ముగా ఉండిపోతున్నారు.
ఇప్పుడు రఘురామకృష్ణంరాజు చెప్పిన దానిని బట్టి.. ఆ పరిణామం కూడా జరగబోతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. పైగా మొన్నటికి మొన్న జగన్ నంద్యాల సలామ్ కేసు విషయంలో మాట్లాడుతూ.. తెలుగుదేశం వాళ్లకి కోర్టులపై ఉన్న పలుకుబడి తమకు లేదంటూ కామెంట్ చేశారు. ఇది కూడా వాస్తవానికి కోర్టు ధిక్కారం కిందే వస్తుంది. రఘురామ చెప్పారంటే.. దానికి లాజిక్ ఉండే ఉంటుంది. ఎందుకంటే జంధ్యాల రవిశంకరే రఘురామరాజుకి న్యాయ సలహాదారుడు. ఆయన చెప్పందే.. ఈయన బయట నోరు విప్పరు. జంధ్యాల రవిశంకర్ అభిప్రాయాన్నే రఘురామరాజు చెప్పారనుకుంటున్నారు. అదే అయితే.. అది పక్కా జరగబోయే పరిణామమే అనుకోవాలి.
మరి అదే జరిగితే.. సీఎం జగన్.. ఎప్పుడో రోజువారీ విచారణ పూర్తయిపోయి.. శిక్ష పడి జైలుకెళతాననే టెన్షన్ నుంచి.. ముందు ఇప్పుడెలా అనే టెన్షన్ ఎక్కువైపోయింది. ముందు బెయిల్ రద్దు నుంచి తప్పించుకోవడమెలా అనేదానిపైనే ఇప్పుడు జగన్, విజయసాయిరెడ్డి కేంద్రీకరించినట్లు చెప్పుకుంటున్నారు.