ఏపీ సీఎం వైఎస్ జగన్ ను తాడేపల్లిలోని ఆయన నివాసంలో విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి కలిశారు. విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను సీఎం అందజేశారు. సీఎంకు వేద ఆశీర్వచనాన్ని ఇచ్చారు.
వచ్చేనెల ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు శ్రీ శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. దానికి సీఎం జగన్ వచ్చి ఆశీర్వచనం పొందాలని స్వాత్మానందేంద్ర కోరారు. స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో పాటు సీఎంని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా కలిశారు.
శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలకు హాజరుకావాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కి కూడా స్వాత్మానందేంద్ర స్వామి ఆహ్వానించారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారి.