తిరుపతి: తిరుమల శ్రీవారికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆనంద నిలయానికి చేరుకున్న సీయం జగన్ శ్రీవెంకటేశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పెద్ద శేష వాహన సేవలో పాల్గొన్నారు. శ్రీనివాసుడికి బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాలు సమర్పించడంలో జగన్ అరుదైన ఘనతను సాధించారు. గతంలో వైఎస్, ఇప్పుడు జగన్.. ఇలా తండ్రీ కుమారులు ముఖ్యమంత్రి హోదాలో స్వామివారికి పట్టువస్త్రాలు అందించడం విశేషం. మామాఅల్లుళ్లుగా యన్టీఆర్, చంద్రబాబు గతంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని పట్టువస్త్రాలు అందించారు.