సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయనపై ఉన్న కేసుల్లో జరగుతున్న ప్రచారం అంతా ఎదో జరగబోతుందన్న ఆలోచనకు ఊతమిస్తున్న తరుణంలో… సీఎం జగన్ తన సొంత గడ్డ పులివెందులకు విడుదల చేయించిన నిధులు చూస్తుంటే మళ్లీ అదే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ సీఎం అయ్యాక క్రిస్మస్ వేడుకల కోసం తొలిసారి సొంత జిల్లాకు వెళ్తున్నారు. దీంతో తన పర్యటనకు ముందే తన సొంత నియోజకవర్గం పులివెందుల, తన సొంత జిల్లా కడపపై నిధుల వర్షం కురిసిందా అనేలా జీవోలు విడుదలయ్యాయి. గత నాలుగు రోజుల్లో మూడు వందల కోట్లకు పైగా నిధులకు సంబంధించిన జీవోలు విడుదలయ్యాయంటే విషయం అర్థం చేసుకోవచ్చు.
కడపలో మెడికల్ కాలేజీలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ కోసం 125కోట్లు, 100 పడకల మెంటల్ హాస్పిటల్ కోసం 40.82కోట్లు, కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం 347కోట్లు, 100 పడకల కేన్సర్ ఆసుపత్రి జీవో, కడప బ్యూటిఫికేషన్ కోసం 55కోట్లు, పులివెందుల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కోసం 63కోట్లు, పులివెందుల స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం 17.5కోట్లు కేటాయించారు. ఇక వీటికి తోడు రహస్యంగా ఇచ్చే జీవోలు, నిధులు ఎలాగు ఉంటాయి.
ఇంత అత్యవరసరంగా జీవోలు విడుదల చేయాల్సిన అవసరం ఏంటీ…? అరెస్ట్ అయితే పులివెందులపై పట్టు పోతుందా అనే భయమా…? అన్న చర్చ ఊపందుకుంది.