గుంటూరు: ఏపీలో 18 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. జగన్ ప్రభుత్వం వచ్చీరాగానే పోస్టింగ్స్ ఇవ్వకుండా నిలిపివేసిన ఇద్దరు అధికారులు కూడా ఈ బదిలీ జాబితాలో వున్నారు. వారికి అంతగా ప్రాధాన్యం లేని పోస్టింగ్స్ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో సీఎంవోలో పనిచేసిన ముగ్గురు సీనియర్ ఐఎఎస్ అధికారులు సతీశ్ చంద్ర, సాయిప్రసాద్, అడుసుమిల్లి రాజమౌళిలకు ఇప్పటివరకు ఇంకా పోస్టింగ్స్ ఇవ్వకుండా ఖాళీగానే వుంచారు. బదిలీ వివరాలు ఇవీ..
ఏపీ హౌసింగ్ కార్పోరేషన్ ఎండీగా అజయ్ జైన్
ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే
ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమిషనర్ గా సిద్ధార్ధ్ జైన్
ఏపీ గిడ్డంగుల కార్పోరేషన్ వీసీ అండ్ ఎండీగా భాను ప్రకాష్
ఆయుష్ విభాగం కమిషనర్ గా పి.ఉషాకుమారి
గిరిజన సహకార సమాఖ్య వీసీ అండ్ ఎండీగా పి.ఎ.శోభ
పునరావాస విభాగం స్పెషల్ కమిషనర్ గా బాబూరావు నాయుడు
మైనారిటీ సంక్షేమ శాఖ స్పెషల్ కమిషనర్‌గా శారదాదేవి
కార్మికశాఖ ప్రత్యేక కమిషనర్‌గా రేఖారాణి
భూపరిపాలనా కమిషనర్ కార్యాలయ సంయుక్త కార్యదర్శిగా చెరుకూరి శ్రీధర్
మార్క్ ఫెడ్ ఎండీగా బాలాజీరావు
ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా సుమిత్ కుమార్
రాజమండ్రి పురపాలక కమిషనర్‌గా అభిషిక్త్ కిషోర్
ఏపీ సాంకేతిక సర్వీసుల ఎండీగా నందకిషోర్
ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి
ఏపీ ఖనిజాభివృద్ధి శాఖ వీసీ, ఎండీగా మధుసూధన్ రెడ్డి
ఇంటర్ బోర్డు ప్రత్యేక కమిషనర్‌గా వి. రామకృష్ణ
ఏపీ అర్బన్ ఫైనాన్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ ఎండీగా చంద్రమోహన్ రెడ్డి