విజయవాడ : తిరుమలలో హిందువులు కాని వారు ఎవరైనా ఉంటే తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ‘హిందూ దేవాలయాలలో హిందువులు మాత్రమే ఉద్యోగాలు చేయాలి. నియామకాలన్నీ వారికే పరిమితం చేయాలి..’ అని జగన్ అధికారులకు సూచించారు. దీనిపై త్వరలో ఉత్తర్వులు కూడా రానున్నాయని సమచారం.