ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం ఢిల్లీకి వెళ్లనున్న ఆయన… తన పర్యటనలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం ప్రధానితో భేటీ ఉంటుందని ఏపీ సీఎంవో వర్గాల సమాచారం.
అమరావతి తరలింపు, మూడు రాజధానుల ప్రతిపాదనతో పాటు శాసన మండలి రద్దుపై సీఎం జగన్ ప్రధానితో పాటు అమిత్ షాతో చర్చించబోతున్నారని, ఈ ఎజెండాతోనే ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది.
Advertisements
అయితే, గతంలో ఎంత నిరీక్షించినా అమిత్ షా అపాయింట్‌మెంట్ దొరకని కారణంగా వెనక్కి వచ్చేసిన సీఎం జగన్… ఈసారి అమిత్ షాతో భేటీ అవుతారా…? అన్నది ఆసక్తిగా మారింది. పైగా ఏపీలో బీజేపీ-జనసేన పొత్తు తర్వాత జగన్ చేస్తున్న తొలి ఢిల్లీ పర్యటన కావటం విశేషం.