వరుసగా రెండు సార్లు ఢిల్లీ వెళ్లాక, అపాయింట్‌మెంట్ లభించక వెనక్కి వచ్చేసిన ఏపీ సీఎం జగన్ ముచ్చటగా మూడోసారి డిల్లీ వెళ్లనున్నారు. కేంద్రహోం మంత్రి , బీజేపీ బాస్ అమిత్‌షాతో జగన్ సమావేశం కాబోతున్నారు.
మొదటిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు ప్రధాని మోడీని కలిసిన జగన్ అప్పటి రాష్ట్ర పరిస్థితులు, ఆర్థికలావాదేవీలు తో పాటు పోలవరం ప్రాజెక్టులపైనా, రాష్ట్రానికి రావాల్సిన నిదులపైనా చర్చలు జరిపారు.
తరువాత రెండో సారి బీజేపీ అధ్యక్షుడు, కేంద్రహోమ్ శాఖ అమిత్ షాను కలవటానికి అపాయింట్మెంట్ కోరారు. అప్పటి పరిస్థితులు దృష్ట్యా జగన్ కు అపాయింట్మెంట్ దొరకలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు జగన్ కు అమిత్ షా అపాయింట్మెంట్ దొరికింది. మహారాష్ట్ర, హర్యానా లో ఎన్నికల ప్రచారాల్లో బిజీ గా ఉన్న షా..ఇప్పుడు జగన్ తో భేటీ కి ఒకే చెప్పారు.
జగన్ సీఎం అయ్యాక మొదటి సారి అమిత్ షా ను కసలుస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఏపీలో బీజేపి– వైసీపీ మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తోంది. ఒకరిపై ఒకరు నిందలెసుకుంటూ, విమర్శలు చేసుకుంటున్నారు.
అయితే, పోలవరంతో పాటు రాష్ట్రంలో చేపడుతున్న రివర్స్ టెండరింగ్, రాజధాని మార్పు అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం కనపడుతోంది.
ఈసారైనా ఢిల్లీ వరకు వెళ్లి ఊరికే వస్తారో, మళ్లీ అమిత్‌షా అపాయింట్‌మెంట్ ఇస్తారో లేదో చూసుకోండి అంటూ టీడీపీ ఇప్పటికే విమర్శలు మొదలుపెట్టింది.