ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. దాదాపు 40 పాటు సాగిని వీరి భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రధానితో జగన్ ఏం మాట్లాడారనేది అధికారికంగా ఎవరూ ప్రకటించకపోయినప్పటికీ ముఖ్యంగా రాజధాని తరలింపు, మండలి రద్దుపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. కియా తరలింపు అంశాన్ని ప్రధాన మంత్రి జగన్ ను అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది.
జగన్ తీసుకున్న మూడు రాజధానుల అంశం ఇప్పుడు రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. మరో వైపు కియా కార్ల కంపెనీని ఏపీ నుంచి తమిళనాడుకు తరలిపోతుందనే వార్తలు వెలువడడంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది, మరో వైపు తనపై ఉన్న కేసుల విషయంలో కేంద్రం ఎలా ప్రవర్తిస్తుందోననే ఆందోళన సీఎం జగన్ లో ఉంది. ఈ నేపధ్యంలో సీఎం జగన్ ప్రధాన మంత్రిని కలవడం ప్రాధానత్య సంతరించుకుంది.