జగన్ తన సొంత టీంను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డట్లు కనపడుతోంది. అధికారంలోకి వచ్చి 5 నెలలు గడిచినా.. పాలనపై పూర్తి పట్టుసాధించలేకపోవటంతో, సొంత టీంను ఏర్పాటు చేసుకోవటంతో పాటు చంద్రబాబు హయంలో కీలకస్థానాల్లో ఉన్న అధికారులకు స్థానచలనం చేస్తున్నారు.
చంద్రబాబు అధికారంలో ఉన్న సమయం టీటీడీ ఈవోగా వచ్చిన అనిల్ కుమార్ సింఘాల్ పై కూడా వేటు పడినట్టు సమాచారం అందుతుంది. అధికారంలోకి వచ్చాక ఇప్పటికే కీలక శాఖల్లో తనకి అనుకూలంగా ఉన్న అధికారులను జగన్ పెట్టుకున్నారు. చంద్రబాబు కి అనుకూలంగా ఉన్నారని డౌట్ వచ్చినాసరే వారి పై బదిలీ వేటు పడుతూనే ఉంది. ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ పై కూడా అదే తరహాలో బదిలీ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. అనిల్ కుమార్ సింఘాల్ స్థానం లో టీటీడీ ఈవో గా జేఎస్వీ ప్రసాద్ ను జగన్ నియమించనున్నా రట.
ప్రస్తుతం జేఎస్వీ ప్రసాద్ కూడా ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్య దర్శిగా పనిచేస్తున్నారు.రెండు రోజుల క్రితం ఆ పోస్టును మరో ఐఏఎస్ అధికారి సతీష్ చంద్రకు కట్టబెట్టింది…