APSRTC విలీనంలో మరో కీలక అడుగు.
ప్రజా రవాణా శాఖ (Public Transport Department (PTD) అనే నూతన శాఖను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు.
దీని ద్వారా సంస్థ ఉద్యోగులకు APCFMS ద్వారా వేతనాలు చెల్లించే వెసులుబాటు.
గుంటూరు: అనేక రోజులుగా సమ్మెచేస్తున్న ఆర్టీసీ కార్మికుల ముందు సీయం కేసీఆర్ సిగ్గుపడి తలవొంచుకోవాల్సిన మేటర్ ఇది.. ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తి చేయడానికి ఆరుగురు సభ్యులతో జగన్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియలో ఇదో ముందడుగు. ఈ కమిటీకి రవాణ శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి, ప్రభుత్వ సంస్థల శాఖ కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. APSRTCకి చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) మరో సభ్యుడిగాను, కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.