గుంటూరు: మూడు నూతన అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు దీనిపై ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌గా పయ్యావుల కేశవ్ నియమితులయ్యారు. ప్రతిపక్షానికి చెందిన సీనియర్‌కు ఈ పదవిని ఇవ్వడం ఆనవాయితీ.
పయ్యావుల నేతృత్వంలో మరో 12 మంది సభ్యులతో ప్రజాపద్దుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు కె.సంజీవయ్య, కొలగట్ల వీరభద్రస్వామి, మేరుగు నాగార్జున, భూమన కరుణాకర్ రెడ్డి, కరణం ధర్మశ్రీ, జోగి రమేష్, కేవీ ఉషాచరణ్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, శాసనమండలి నుంచి ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, డి.జగదీశ్వరరావు, విఠపు బాలసుబ్రహ్మణ్యం ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
అంచనాల కమిటీ ఛైర్మన్‌గా రాజన్న దొర, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్‌గా చిర్ల జగ్గిరెడ్డి నియమితులయ్యారు.
ఈ మూడు కమిటీల్లోనూ ఉభయసభలకు చెందిన సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.