రెడ్డిప్రదేశ్! - ap cm ys jagan appoints retd ips officer shashidar reddy as intelligence osd- Tolivelugu

రెడ్డిప్రదేశ్!

ap cm ys jagan appoints retd ips officer shashidar reddy as intelligence osd, రెడ్డిప్రదేశ్!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇలాఖాలో మరో రెడ్డి కొలువు తీరారంటూ ప్రత్యర్ధులు కామెంట్లు విసురుతున్నారు. ఇంటలిజెన్స్ విభాగంలో ఓఎస్‌డీగా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి శశిధర్‌రెడ్డిని నియమించడమే వారి విమర్శలకు రీజన్.

ap cm ys jagan appoints retd ips officer shashidar reddy as intelligence osd, రెడ్డిప్రదేశ్!

#highlyrespectedreddy ఈ మధ్య సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్న టాగ్ ఇది. ఆంధ్ర ప్రదేశ్ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి ఏదన్న వెరైటీ నిర్ణయం తీసుకున్నా…లేదు మరో రెడ్డి పేరు ఉన్న వ్యక్తికి పోస్ట్ ఇచ్చినా, జనం తెగ ట్రోల్ చేస్తున్నారు.
వీళ్ళు ట్రోల్ చేస్తున్న దానిలో నిజం ఎంత? ఆంధ్రాలో రెడ్డి పేరుకు పవర్ ఎక్కువ అయ్యిందా…తొలివెలుగు తెలుసుకునే ప్రయత్నం చేసింది.
ఒక విధంగా చూసుకుంటే ఈ వ్యాఖ్యల వెనుక నిజమే ఉందనే అనిపిస్తోంది. మేము ఈ ఆర్టికల్ రాయడం మొదలు పెట్టి ముగించేలోపు…మరో రెడ్డి పేరుకు ఒక కీలక పదవి కట్టబెట్టేసారు. ఏంటి మీ గోల…అర్హత ఉన్నవాళ్ళకి ఇస్తే ఏంటి అంటారా?
తెలంగాణ పోలీస్ అకాడమీలో డైరెక్టర్‌గా పనిచేస్తూ, పదవీ విరమణ పొందిన శశిధర్‌రెడ్డికి వైఎస్ జగన్ ఇంటలిజెన్స్ ఓఎస్డీగా కీలకబాధ్యతలు అప్పగించారు. ఇంత మంది టాలెంటెడ్ ఆఫీసర్లు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో వారిని వదిలేసి…రిటయిర్మెంట్ తీసుకొన్న పక్క రాష్ట్రం పోలీస్ ఆయనను తీసుకొచ్చి కీలక పదవి కట్టబెట్టడం వెనుక ‘రెడ్డి’ టాగ్ లేదా అని మొహమాటం లేకుండా అడిగేస్తున్నారు.
ఇటీవలే ఐటీ విభాగంలో ఉన్న ముఖ్య పోస్టులన్నీ రెడ్డి సామాజిక వర్గం వారికే అప్పజెప్పగా.. మరో వ్యక్తి లోకేష్‌రెడ్డిని ఐటీ సలహాదారుగా జగన్ నియమించుకున్నారు.
రాష్ట్రంలో 6% ఉన్న రెడ్లకు మెజారిటీ వాటా పదవులు దక్కటం ఏ విధమైన సామాజిక న్యాయమంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వినిపిస్తున్నాయి.
ఒకసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తే… తిరుగులేని మెజారిటీతో పాలనా పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్, వివిధ సామాజిక వర్గాలకు చెందిన నేతలకు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవులు కేటాయిస్తూ రాష్ట్రవ్యాప్త చర్చకు తెరతీశారు. అలాగే, అన్ని శాఖల్లో ఉండే నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు 50 శాతం కేటాయింపులు ఉంటాయని స్పష్టమైన హామీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం.. తరువాత ఆచరణలో ఆ దిశగా అడుగులు వేయటం లేదన్న విమర్శల్ని మూటకట్టుకుంటోంది. ఆ వివరాల్ని ఒక్కసారి చూస్తే..

ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శిగా కె. ధనుంజయ రెడ్డి,
ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారిగా పి. కృష్ణ మోహన్ రెడ్డి,
ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిగా నాగేశ్వర రెడ్డి,

ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా అజేయకల్లం రెడ్డి,

తూడా ఛైర్మెన్‌గా చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి,

టీటీడీ ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి,

టీటీడీ ఛైర్మెన్‌గా వై.వి.సుబ్బారెడ్డి,

APIIC ఛైర్మెన్‌గా రోజారెడ్డి,

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సహాదారుగా సజ్జల రామక్రిష్ణా రెడ్డి,

రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల సలహాదారు శైలజా రామకృష్ణారెడ్డి,

ఎపి భవన్ ప్రత్యేక ప్రతినిధిగా వి.విజయసాయి రెడ్డి,

రాజ్యసభ పక్ష నేతగా వి.విజయసాయిరెడ్డి,

వైసీపీ పార్లమెంటరి పార్టీ నేతగా వి.విజయసాయి రెడ్డి,

ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వి.విజయసాయి రెడ్డి,

ప్రభుత్వ క్యాబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సభ్యులుగా వి.విజయసాయి రెడ్డి,

ఎయిమ్స్ మంగళగిరి డైరెక్టర్‌గా వి.విజయసాయి రెడ్డి.

లోక్ సభ పక్ష నేతగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి,

లోక్ సభ ప్యానల్ స్పీకర్‌గా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి,

రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సభ్యులుగా పెద్దిరెడ్డి. మిధున్ రెడ్డి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ గా గడికోట శ్రీకాంత్ రెడ్డి,

ప్రభుత్వ విప్‌గా కాపు రామచంద్రా రెడ్డి

ప్రభుత్వ విప్‌గా పిన్నేల్లి రామక్రిష్ణా రెడ్డి,

ప్రభుత్వ విప్‌గా గంగుల ప్రభాకర్ రెడ్డి

రైతు సాధికార సంస్థ ఛైర్మెన్‌గా వై.మదుసూదన్ రెడ్డి,

రాష్ట్ర స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్‌గా చల్లా మదుసూదన్ రెడ్డి,

PKM అర్బన్ డెవలప్ మెంట్ ఆధారిటి ఛైర్మెన్‌గా యం. సుబ్రమణ్యం రెడ్డి,

రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా పొన్నవొలు సుధాకర్ రెడ్డి,

రాష్ట్ర ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సలహాదారుగా వి.యన్.భరత్ రెడ్డి,

ఉన్నత విద్యా మండలి ఛైర్మెన్ గా కె.హేమచంద్రా రెడ్డి,

CRDA ఛైర్మెన్‌గా అళ్ల రామకృష్ణారెడ్డి,

వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ యం.వి.ఎన్.నాగిరెడ్డి,

వ్యవసాయ మిషన్ సభ్యులుగా పి.రాఘవ రెడ్డి,

వ్యవసాయ మిషన్ సభ్యులుగా చంద్రశేఖర రెడ్డి,

నెల్లూరు అర్బన్ డెవలప్ మెంట్ ఛైర్మెన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

రాష్ట్ర ఐటి సలహాదారుగా కె.రాజశేఖర రెడ్డి
రాష్ట్ర ఐటి సలహాదారుగా శ్రీనాధ్ దేవి రెడ్డి
ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా ప్రసాద్ రెడ్డి
ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా బైరాగి రెడ్డి,
ఆంధ్రా యూనివర్సిటీ, సీటిసీ డీన్‌గా పాండురంగా రెడ్డి,
రాజీవ్ గాంధీ యునివర్సిటీ వీసీగా కె.సి.రెడ్డి,
విండ్ & సోలార్ పవర్ సంప్రదింపుల కమిటీ సభ్యులుగా బి.రాజేంద్రనాధ్ రెడ్డి,
విండ్ & సోలార్ పవర్ సంప్రదింపుల కమిటీ సభ్యులుగా బి.శ్రీనివాసులు రెడ్డి ,
విండ్ & సోలార్ పవన్ సంప్రదింపుల కమిటీ సభ్యులుగా డి.కృష్ణ గోపాల్ రెడ్డి,
క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులుగా బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి,
క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,
క్యాబినెట్ సబ్ కమిటీ ప్రత్యేక సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,
క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులుగా మేకపాటి గౌతమ్ రెడ్డి,
రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ సలహాదారుగా జె.విద్యాసాగర్ రెడ్డి,
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా కాసా జగన్ మోహన్ రెడ్డి,
రాష్ట్ర వైద్య సంస్కరణల కమిటీ సభ్యులు భూమిరెడ్డి చంద్రశేఖర రెడ్డి,
రాష్ట్ర వైద్య సంస్కరణల కమిటీ సభ్యులు బి.సాంబశివా రెడ్డి,
రాష్ట్ర వైద్య సంస్కరణల కమిటీ సభ్యులు కసిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి,
రాయలసీమ యూనివర్సిటీ విసి సివీ కృష్ణా రెడ్డి
శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ మల్లికార్జునరెడ్డి,
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీధర్ రెడ్డి
ఏవియేషన్ ఆడ్వయిజర్‌గా వి.యన్.భరత్ రెడ్డి.
మరి ఈ నియామకాలన్నీ ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే జరుగుతున్నాయా లేక ఆయన చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ని తప్పుదారి పట్టిస్తోందా అన్న ఆందోళనలో వైసీపీ శ్రేణులు ఉన్నాయి.
తొలివెలుగు ఈ లెక్క అంత ఒకసారి లెక్కపెట్టడానికి ట్రై చేసింది. మాకు 57 మంది లెక్క తేలింది! అయితే ఇది ఇక్కడితో ఆగేలా లేదని కూడా కొంతమంది అంటున్నారు. మగధీర క్లైమాక్స్ లో షేర్ ఖాన్ లెక్కేసినట్టు…. 57 , 58 అంటూ మనం లెక్కేసుకోవాలే కానీ 100 దాటడం పెద్ద కష్టం కాదంటున్నారు సోషల్ మీడియా జనం.
మొత్తానికి అదేదో కాలేజీ ర్యాంకుల యాడ్ లాగ, ఒకటి, ఒకటి, ఒకటి కాకుండా… రెడ్డి, రెడ్డి, రెడ్డి అని చెప్పుకునే రోజులు ఆల్మోస్ట్ వచ్చేశాయనే సెటైర్లు కూడా తెగ వినిపిస్తున్నాయి!!! జగన్ గారు, మరి మీరు వింటున్నారా?

Share on facebook
Share on twitter
Share on whatsapp