విజయవాడ : ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేర్లు మార్చడం ఆనవాయితీగా వస్తోంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గతంలో పెట్టిన పేర్లు తీసివేసి, ఆ పార్టీకి చెందిన నాయకుల పేర్లు పెట్టడం అలవాటైపోయింది. కొన్ని పథకాలను పూర్తీగా రద్దు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అధికారంలోకి వచ్చిన పార్టీ అదే చేసింది. ఈ సారి కూడా అదే జరిగింది. గతంలో ఉన్న పథకాల పేర్లు అన్నిటిని మార్చివేశారు. కొన్ని పథకాలను రద్దుచేశారు.ఈసారి ఏకంగా ఇప్పటి వరకు 30 పేర్లకు వైఎస్ఆర్ పేరు పెట్టారు.
1.వైఎస్ఆర్ రైతు భరోసా, 2.వైఎస్ఆర్ 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, 3. వైఎస్ఆర్-పీఎం ఫసల్ బీమా యోజన 4.వైఎస్ఆర్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్, 5.రైతులకు వైఎస్ఆర్ వడ్డీలేని రుణాలు, 6. వైఎస్ఆర్ స్కూల్ మెయింట్ నెన్స్ గ్రాంట్, 7. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, 8. డాక్టర్ వైఎస్ఆర్ ట్రైబల్ మెడికల్ కాలేజీ, 9. వైఎస్ఆర్ గృహ వసతి, 10. వైఎస్ఆర్ అర్బన్ హౌసింగ్, 11. పట్టణ స్వయం సహాయ బృందాలకు వైఎస్ఆర్ వడ్డీలేని రుణాలు, 12. వైఎస్ఆర్ బీమా, 13. నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు వైఎస్ఆర్ ఆర్థిక సహాయం, 14.చేనేత కార్మికులకు వైఎస్ఆర్ సహాయం, 15. మత సంస్థలకు వైఎస్ఆర్ గ్రాంట్లు, 16. వృద్ధులు, వితంతువులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక, 17. దివ్యాంగులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక, 18.ఒంటరి మహిళకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక, 19. మత్స్యకారులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక, 20. ఎయిడ్స్ రోగులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక, 21. డయాలసిస్ రోగులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక, 22. కల్లు గీత కార్మికులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక, 23. డాక్టర్ వైఎస్ఆర్ అభయ హస్తం, 24. ట్రాన్స్ జండర్లకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక, 25. బీసీ సంక్షేమ వైఎస్ఆర్ కల్యాణ కానుక, 26. ఎస్సీ సంక్షేమ వైఎస్ఆర్ కల్యాణ కానుక, 27. ఎస్టీ సంక్షేమ వైఎస్ఆర్ గిరిపుత్రిక కల్యాణ పథకం, 28. మైనార్టీ సంక్షేమం వైఎస్ఆర్ షాదీకా తోఫా, 29.వివాహ ప్రోత్సాహక అవార్డులు వైఎస్ఆర్ కల్యాణ కానుక, 30. కులాంతర వివాహ ప్రోత్సాహక వైఎస్ఆర్ కల్యాణ కానుక. భవిష్యత్ లో మరికొన్నిపేర్లు ఈ జాబితాలో చేరతాయని పలువురు అనుకుంటున్నారు.