విశాఖలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జి పాలిమర్స్ పరిశ్రమలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా , పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పరిశ్రమ నుంచి వెలువడిన రసాయన వాయువు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది.
ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. 11.45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో విశాఖ వెళ్లనున్నారు. అక్కడ పరిస్థితులపై అధికారులు చేపట్టిన చర్యలపై పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే అప్రమత్తమైన ఎన్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఇళ్లలోంచి ప్రజలను తరలిస్తున్నారు.