నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరింత వేడెక్కాయి. సీఎం జగన్ స్వయంగా టీడీపి ఎమ్మెల్యే రామానాయుడు పై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చే వరకు వెళ్ళింది. దీనిపై వెంటనే రియాక్ట్ అయిన స్పీకర్ తమ్మినేని…. హౌస్ ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేశారు.
నిమ్మల రామానాయుడు పై సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా… వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష సభ్యులవైపు దూసుకెళ్లారు. దింతో రామానాయుడు పై దాడి జరుగుతుందని భావించిన టీడీపీ ఎమ్మెల్యేలు రామానాయుడు చుట్టూ వలయంలా ఏర్పడి, కాపాడుకున్నారు.
పెన్షన్ లపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే రామా నాయుడు చేసిన ప్రసంగం పై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను పక్కదోవ పట్టిస్తున్నారని తీవ్రంగా స్పందించారు. ఓ దశలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యేకు సభలో మాట్లాడే హక్కు లేదంటూ సీఎం వ్యాఖ్యనించారు.