గత ప్రభుత్వ హయాంలో విశాఖపట్నం, దాని చుట్టు ప్రక్కల భూముల కేటాయింపులపై జగన్ సర్కార్ దృష్టిసారించింది. విశాఖ భూస్కాంపై కొత్త సిట్‌ను నియమిస్తూ జీవో జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ నేతృత్వంలో ముగ్గురితో సిట్ వేయగా, సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ వైవీ అనురాధ, రిటైర్డ్ జడ్జ్ టి.భాస్కర్‌రావు ఉన్నారు. ఈ కమిటీ ప్రజలు, ప్రజాసంఘాల నుండి విజ్ఙప్తులు తీసుకోవటం, తమ దృష్టికి వచ్చిన భూకేటాయింపుల్లో అవకతవకలపై విచారణ జరుపనుంది. ఈ కమిటి అవసరమైతే ఎవరినైనా విచారించే అధికారాన్ని కట్టబెట్టింది ప్రభుత్వం.
ఈ స్కాంలో ఇద్దరు మాజీ మంత్రులు, అయిదుగురు ప్రజాప్రతినిధులున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేస్తూ, సిట్ వేసిన జీవో ఇదే: