ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. గుంటూరులోని భారత్‌పేటలోని 140వ వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆయన.. తాజాగా అక్కడే టీకా వేయించుకున్నారు. వ్యాక్సిన్ తీసుకునే సమయంలో ఆయన సతీమణి వైఎస్ భారతి ఆయన వెంటే ఉన్నారు.
వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత జగన్ కొద్దిసేపు అక్కడే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఈ సమయంలో వార్డు సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బందితో ముచ్చటించారు. అనంతరం వార్డు/గ్రామ సచివాలయాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా 45 ఏళ్లు దాటిన వారికి కరోనా టీకా వేయాలని కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించింది.