ఎట్టకేలకు అగ్రిగోల్డ్ బాధితులకు తీపి కబురు అందింది. ఇరవై వేల రూపాయల లోపు డిపాజిటర్లకు సొమ్ము చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆస్తుల వేలం ప్రక్రియ ఆలస్యమవుతున్న నేపథ్యం లో ముందుగానే బాధితులకు సొమ్మును చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియను వేగవంతం చెయ్యాలని అధికారులను అధిషించారు. ఇప్పటికే పదివేలరూపాయల లోపు డిపాజిటర్లకు చెల్లింపులు చేసింది ప్రభుత్వం.