ఒక గీత గీసి.. దానిని చెరపకుండా.. చిన్నది చేయాలని అప్పట్లో తెనాలి రామలింగుడికి ఎవరో పరీక్ష పెట్టారని కథలు చదువుకున్నాం. అప్పుడు తెనాలి రామకృష్ణ ఆ గీత పక్కనే మరో పెద్ద గీత గీసి.. దాని కంటే ఇది చిన్నదే కదా అని చూపించి చప్పట్లు కొట్టించుకున్నాడు. ఇప్పుడదే ఫార్ములాను జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నారనే అనుమానాలు వస్తున్నాయి.
తాను ఆల్రెడీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పీకల్లోతు ఇరుక్కుపోయి ఉన్నారు. బెయిల్ మీద బయటికొచ్చి ఏకంగా సీఎం కూడా అయ్యారు. ఇప్పుడదే బెయిల్ రద్ద వుతుందని.. శిక్ష కూడా పడుతుందని.. అందుకే సంక్షేమ కార్యక్రమాలు వేగంగా పూర్తి చేసి ప్రజల మద్దతు భారీగా పొంది.. తాను జైలుకెళితే సానుభూతి వెల్లువెత్తేలా చేయాలనే ఆలోచనలో ఉన్నారనే వార్తలు వినపడుతున్నాయి.
ఇప్పుడు రాజకీయ ప్రత్యర్ధి చంద్రబాబు పదే పదే తన కేసుల గురించి మాట్లాడుతుంటే మండిపోతోంది. అందుకే ఆయనపై ఓటుకు నోటు కేసు గురించి పదే పదే గతంలో వైసీపీ ప్రస్తావించేది. ఇప్పుడా అవకాశం రావటం లేదు. అందుకే చంద్రబాబును సైతం ఏదో ఒక కేసులో ఇరికిస్తే.. తన కేసు గురించి ఇక టీడీపీవారు మాట్లాడలేరు కదా.. అనే ప్లాన్ ను అమలులో పెట్టినట్లు అనిపిస్తోంది. 14 ఏళ్ల క్రితం ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని ఎన్టీఆర్ గారి భార్య, ప్రస్తుతం తెలుగు అకాడమీ ఛైర్మన్ అయిన లక్ష్మీపార్వతి కంప్లయింట్ ఇచ్చారు. దాని మీద హైదరాబాద్ లోని ఏసీబీ కోర్టు ఇప్పుడు స్పందించింది. ఆ స్పందన ఇప్పుడు రావడం వెనుక ఎలాంటి టెక్నికల్ వ్యవహారాలు జరిగాయో తెలియదు. కాని ఏసీబీ కోర్టు చంద్రబాబుపై విచారణ జరపొచ్చని చెబుతూ.. 25వ తేదీకి వాయిదా వేసింది. ఒకవేళ విచారణకు గనుక ఆదేశిస్తే.. సేమ్ కేస్. ఇది కూడా ఆదాయానికి మించిన ఆస్తుల కేసు అవుతుంది. సీబీఐ అయితే బిజెపితో కుదరదు కాబట్టి.. ఏసీబీ అయితే స్టేట్ లెవెల్ లోనే చేయొచ్చు అనేది ప్లాన్ లాగా కనపడుతుంది.
అప్పుడు.. నువ్వు నేను ఇద్దరం కేసుల్లో ఉన్నాం. నీ కేసు వెనుక కుట్ర ఉంటే.. నా కేసు వెనక ఏముంది మరి అని ప్రశ్నించొచ్చు. కేసుల వ్యవహరం కామనే అని జనం కూడా అనుకునే పరిస్ధితి వచ్చేస్తుంది. మళ్లీ ఎన్నికలు జరిగినా.. ఈ కేసుల గోల పెద్దగా ఉండదు.. తాను జైల్లో ఉన్నా.. పార్టీని గెలిపించుకోవచ్చు.. తాను సీఎం కాలేకపోయినా.. తన భార్యను సీఎంగా కూర్చోబెట్టొచ్చు లాంటి ఆలోచనలతో జగన్ ముందుకు వెళుతున్నారని సమాచారం.