ఇప్పుడు పరిస్థితులు వేరు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు అప్పుడు ఇవ్వలేదు. దీనిపై ఇప్పుడు మళ్లీ విచారణ చేపట్టవచ్చు.. అంటూ జగన్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ వాదనతో సీబీఐ కోర్డు ఏకీభవించడం ఒక ముఖ్య పరిణామం.
వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ సీఎం జగన్ వేసిన పిటిషన్ విచారణార్హతపై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. గతంలో హైకోర్టు కొట్టివేసినందున మళ్లీ ఎలా విచారణ చేపడతామని సీబీఐ కోర్టు ప్రశ్నించింది. తమ పరిస్థితులు మారినందున మళ్లీ విచారణ చేపట్టవచ్చని జగన్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. జగన్ పిటిషన్‌ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. జగన్ తరఫు న్యాయవాది వాదనతో సీబీఐ న్యాయస్థానం ఏకీభవించింది.
జగన్ అక్రమాస్తుల కేసులో పెన్నా సిమెంట్స్ అనుబంధ ఛార్జిషీట్‌పై సీబీఐ కోర్టులో వాదనలు జరిగాయి. పలువురిపై దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. తెలంగాణ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ శ్రీలక్ష్మి, విశ్రాంత ఐఏఎస్ శామ్యూల్, గనులశాఖ మాజీ అధికారి రాజగోపాల్, డీఆర్‌వో సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ ఎల్లమ్మపై అదనపు ఛార్జిషీట్ దాఖలు చేశారు.