ఏపీ సీఎం జగన్ బ్యాట్ పట్టారు. ఫోర్లు బాది ఆటగాళ్లలో ఉత్సాహం నింపారు. కడప జిల్లా బద్వేలులో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దాదాపు రూ.500 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు జగన్.
ఈ క్రమంలోనే వైఎస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం అభివృద్ధి పనులును ప్రారంభించారు జగన్. అనంతరం సరదాగా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడారు. ఫోర్లు బాది ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపారు. చివరిలో బ్యాట్, బంతిపై సంతకం చేశారు జగన్.
జగన్ క్రికెట్ ఆడిన వీడియోలు, ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా వైసీపీకి చెందిన గ్రూపుల్లో ఫార్వార్డ్ అవుతున్నాయి. జగన్ క్రికెట్ ఆడిన స్టయిల్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు వైసీపీ కార్యకర్తలు.