గుంటూరు : తమ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేసి వేధిస్తున్నారని చెబుతూ, తమకు అండగా ఉండాలంటూ ప్రకాశం జిల్లా రామచంద్రాపురం గ్రామం నుంచి నాలుగో తరగతి విద్యార్థిని కోడూరి పుష్ప రాసిన లేఖపై సీయం జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. చిన్నారి పాప తనకు లేఖ రాసిందని వచ్చిన వార్తల ఆధారంగా ముఖ్యమంత్రి వెంటనే ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్‌కు ఫోన్ చేసి ఆరాతీశారు. వెంటనే ఆ గ్రామాన్ని సందర్శించి వివరాలు పూర్తిగా కనుక్కుని, సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.