ఏసీబీ నైతికతను దెబ్బ తీసే ప్రయత్నం జరుగుతుందని, రెవెన్యూ మంత్రి వ్యాఖ్యలు తీవ్రమైనవని.. ముఖ్యమంత్రి సైతం నోరు మెదపలేదంటూ తొలివెలుగు ఏసీబీ అధికారుల ఆవేదనను వెలుగులోకి తెచ్చింది. దీనిపై ఏసీబీ అధికారుల్లోనూ, ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పదే పదే అవినీతిని అంతమొందించాలంటున్న సీఎం, ఏసీబీని ఓ మంత్రి ఇన్ని మాటలు అంటే స్పందించకపోవడమేంటనే ప్రశ్నను తొలివెలుగు ప్రజల ముందుంచింది.
మంగళవారం స్పందనపై రివ్యూ సందర్భంగా ముఖ్యమంత్రి ఏసీబీపై నోరు విప్పారు. ఏసీబీ చురుగ్గా పని చేస్తుందని చెప్పారు. అంతే కాదు.. మరో రెండు మూడు వారాల్లో ఏసీబీ విరుచుకుపడబోతుందని.. పై నుంచి కిందివరకు అధికారులు అవినీతి చేయాలంటే భయపడేలా ఉంటుందని చెప్పారు.
దీంతో ఏసీబీ అధికారుల మొహాల్లో మళ్లీ వెలుగు వచ్చింది. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందేయడానికి సిద్ధమైపోయారు. ఏసీబీ ఇమేజ్ ను డ్యామేజ్ చేశారని ఆందోళన చెందుతున్న సమయంలో.. ముఖ్యమంత్రి ఇచ్చిన కితాబు వారికి టానిక్ లా పని చేసే అవకాశం ఉంది.
తొలివెలుగు ఏసీబీపై ఏం రాసిందంటే…ఏసీబీని నైతికంగా దెబ్బ తీసే ప్రయత్నం