నగరి ఎమ్మెల్యే రోజా పై ముఖ్యమంత్రి జగన్ మరో సారి ఫైర్ అయ్యారట. తనకిచ్చిన పదవిపై కాకుండా, జబర్దస్త్ షో కి ఎక్కువ టైమ్ కేటాయిస్తున్నావంటూ చిందులు తొక్కారట. ప్రతిపక్షం లో ఉన్న సమయంలో అటు ఎమ్మెల్యేగా చేసుకుంటూ టీవీ షోలలో చేసుకున్నా జగన్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వైసీపీ అధికారం లో ఉంది. అంతే కాకుండా ఏపీఐఐసి పదవిని ఇస్తూ రోజాకి కేబినెట్ హోదా కల్పించారు జగన్. అయితే ఆ పదవిపై రోజా అంత సంతృప్తిగా లేదని సన్నిహితులు గుస గుస లాడుకుంటున్నారు.
పూర్తి స్థాయిలో పదవి, రాజకీయాలపై దృష్టిపెట్టాలని, టీవీ షోలకు కొంచెం దూరంగా ఉండమని జగన్ చెప్పాడట. ఈ పదవిలో బాగా రాణిస్తే రాబోయే రెండేళ్లలో మంత్రి పదవి ఇస్తానని కూడా జగన్ మాటిచ్చాడని రాజకీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం రాజకీయాల్లో కన్నా టీవీ షోలతో రోజా బాగా డబ్బులు సంపాదిస్తుందట, కానీ రాజకీయంగా ఎదగాలంటే ఎదో ఒకటి వదులుకోవాలి కాబట్టి టీవీ షోలకు దూరంగా ఉండాలని రోజా నిర్ణయించుకుందని సమాచారం.