జగన్ కు షాక్ ఇచ్చిన వైసీపీ ఎంపీలు - Tolivelugu

జగన్ కు షాక్ ఇచ్చిన వైసీపీ ఎంపీలు

ap cm ys jagan shocks with ycp mps over supports to telugu medium in schools, జగన్ కు షాక్ ఇచ్చిన వైసీపీ ఎంపీలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఆ పార్టీ ఎంపీలు అనుకోని విదంగా షాక్ ఇచ్చారు. పార్లమెంటు సాక్షిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కు వ్యతిరేకంగా తెలుగు భాషను పరిరక్షించాలని కోరారు. మొదట పార్లమెంటు లో వ్యవహరించాల్సిన తీరుపై పార్టీ నిర్ణయం కట్టుబడి మాట్లాడాలని లేదంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని చెప్పినా  ఎంపీలు వెనక్కి  తగ్గలేదు. జగన్ పై ఉన్న పూర్తి అసంతృప్తిని వ్యక్తపరిచారు.

పార్లమెంటు లో వ్యవహరించాల్సిన తీరుపై విజయసాయిరెడ్డి నివాసం లో ఏర్పాటు చేసిన సమావేశానికి సైతం కొంతమంది ఎంపీలు డుమ్మాకొట్టరని తెలుస్తుంది. జగన్ తీరుపై పూర్తిస్థాయిలో అసంతృప్తిగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన అధికారం మాకు ఇవ్వట్లేదని, ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే ల అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారట.

మరో పక్క వైసీపీ ఎంపీలు పార్లమెంటులో వ్యవహరించిన తీరుపై జగన్ కోపంగా ఉన్నారట. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండకుండా  ఎవరి ఇష్టం వచ్చినట్టు  వాళ్ళు వ్యవహరించటంపై మండిపడుతున్నారట. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంకు వ్యతిరేకంగా ఎంపీ చేసిన వ్యాఖ్యలపై వివరణ అడగాలంటూ   ఉభయగోదావరి జిల్లాల ఇంచార్జ్ వైవి సుబ్బారెడ్డికి ఆదేశాలు జారీచేశాడట. 

ప్రభుత్వాన్ని  వ్యతిరేకిస్తూ ఎవరు మాట్లాడినా ,  వారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించే ప్రశ్నే ఉండబోదంటూ  జగన్ చెప్పుకొచ్చారట.  తెలుగు మీడియం అన్న విధానాన్ని సమర్థిస్తూ ఎవరు వ్యాఖ్యలు చేసినా క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు, పార్టీ నుంచి బహిష్కరించేందుకు ఏ మాత్రం ఉపేక్షించమంటూ జగన్ హెచ్చరించారట.
అయితే  జగన్ ను ఎదిరించి ఎంపీలు ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక పెద్ద మతలబ్ ఉందట. ఇటీవల ఎంపీ  రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరుతున్నారని, తనతో పాటు కొంతమంది ఎంపీలను కూడా తీసుకువెళ్తున్నారని రాజకీయవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ బీజేపీ లో వైసీపీ ఎంపీ లు చేరితే వైసీపీ పని అయిపోయినట్టేనంటూ విశ్లేషకులు అనుకుంటున్నారట.
Share on facebook
Share on twitter
Share on whatsapp