జగన్ స్పెషల్: 73 లక్షల కిటికీ - Tolivelugu

జగన్ స్పెషల్: 73 లక్షల కిటికీ

ap cm ys jagan spends 73 lakh rupees for aluminium windows to jagan house, జగన్ స్పెషల్: 73 లక్షల కిటికీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ అప్పట్లో ప్రగతి భవన్ లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ లు కట్టించారని అవాక్కైన జనం ఇప్పుడు జగన్ అల్యూమినియం కిటికీల గురించి మాట్లాడుకుంటున్నారు. సాధారణ అల్యూమినియం కిటికీల గురించి అంతగా ఆశ్చర్య పోవాల్సిన విషయం ఏముంది అని అనుకుంటే పొరపాటే. చర్చ జరుగుతున్నది అవి అసాధారణ కిటికీలు కాబట్టే!

పోయిన నెల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం. 259ను తొలివెలుగు సంపాదించింది. దాని ప్రకారం ముఖ్యమంత్రి తాడేపల్లి ఇంటికి అల్యూమినియం కిటికీలు పెట్టించడానికి అక్షరాలా 73 లక్షల రూపాయిలను విడుదల చెయ్యాలని నిర్ణయించారు. ఏంటి…కిటికీలు, తలుపులు పెట్టించుకోవడానికి డబ్భై మూడు లక్షలా అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంకొంతమంది…అంత డబ్బుతో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం ఏకంగా కనీసం రెండు చక్కటి ఫ్లాట్ లు కొనుక్కుంటాం అని సెటైర్లు వేస్తున్నారు.

అబ్దుల్ కలాం అవార్డును వైఎస్సార్‌ విద్యా పురస్కార్ అని మారుస్తూ విడుదల చేసిన జిఓ వల్ల గొడవ జరగడంతో…జగన్ అది నాకు తెలియకుండా జారీ చేయబడ్డ జీవో అని సముదాయించుకున్న విషయం తెలిసిందే. అది సద్దుమణగకముందే కిటికీల కథ తెర మీదకొచ్చింది. అప్పట్లో క్యాంపు కార్యాలయం వద్ద రోడ్లు, హెలిపాడ్ నిర్మాణానికి 6.89 కోట్లను విడుదలచేసి వివాదాస్పదమయ్యారు.

విషయం బయటపడింది కాబట్టి ఈ జీవో కూడా నాకు తెలియకుండా వచ్చిందే అంటారేమో సీఎం జగన్.

ap cm ys jagan spends 73 lakh rupees for aluminium windows to jagan house, జగన్ స్పెషల్: 73 లక్షల కిటికీ

Share on facebook
Share on twitter
Share on whatsapp