అమరావతి నుంచి విశాఖపట్నం కు రాజధాని తరలించాలన్న నిర్ణయాన్ని వచ్చే ఏడాది వరకు పక్కన పెట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు విశ్వనీయసమాచారం. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన పక్క క్షణంలోనే జగన్ సంకల్పించిన ప్రాధాన్యతలలో నవరత్నాలది మొదటి స్దానం అయితే ,రాజధాని మార్పు రెండవస్దానం , ఏన్నికల ముందు నుంచి ఆయన ఆ విషయంలో దృడసంకల్పంతో ఉన్నాడు. ఏట్టి పరిస్థితి లో ఆంధ్రులకు అమరావతి రాజధాని కాకూడదని ఆయన అభిప్రాయం. మొన్న సంక్రాంతికి తన కార్యస్దానం విశాఖకు అని ముహుర్తం పెట్టుకున్నాడు. అయితే అక్కడ ఏర్పాట్లు జరగక పోవడంతో ఉగాదికి వెళ్ళాలనుకున్నాడు. సచివాలయం ఉద్యోగులను కూడ వైజాగ్ కు వెళ్ళేందుకు సిద్దపడాలని స్పష్టమైన సూచన చేశారు. ఇప్పుడు ఆరేడు నెలల తరువాత అనే నిర్ణయానికి వచ్చి నట్లు సమాచారం.
ఈ ఏడాది కాలంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలమీద హైకోర్టులో దాదాపు 53వివాదాలు నడిచాయి. అధికభాగం వ్యతిరేక తీర్పలు వచ్చాయి. కాని ఏ ఒక్క తీర్పును ఆయన పట్టించుకోవడం లేదు.న్యాయ పరమైన చిక్కుముడులను తప్పించుకోవడానికి సవల క్ష దారులు ఉంటాయన్నది ఆయన ధీమ…పరిపాలన చేసేది తాను ఉండాలే తప్ప న్యాయస్థానాలు చెబితే నడుచుకోవడం తనకు ఇష్టం ఉండదని ఆయన సన్నిహితులకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కరోన సంక్షోభం ఆయన నిర్ణయానికి కారణమని కొంత మంది వైసిపి నేతలు చెబుతున్నారు.