జగన్ ఎవ్వరిని కలవడం లేదు. ఆయన ఇప్పుడు సీతయ్య! సీతయ్య అంతే.. ఎవరి మాటా వినడు. జగన్ కూడా సేమ్ టు సేమ్. ప్రస్తుతం ఎవరి మాటా వినే పరిస్థితి లేదు. కనీసం తన సొంత ఎంఎల్ఏలను కూడా కలిసి, వాళ్ల మాటలు ఆలకించేందుకు సిద్ధంగా లేరు.. ఇదీ ఇప్పుడు వినిపిస్తున్న టాక్! ఈ టాక్ తన దాకా వెళ్లిందో ఏమో యువ ముఖ్యమంత్రి రూటు మార్చుకున్నారు. ఒక ముఖ్యమైన డెసిషన్ తీసుకున్నారు..
గుంటూరు: ‘‘జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యేంతవరకు పాదయాత్రలంటూ ప్రజల మధ్య తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. సీఎం కుర్చీలో కూర్చున్న మరుక్షణం మారిపోయారు. ఎవ్వరిని కలవడం లేదు” – అన్నది జగన్ గురించి వినిపిస్తున్న అతి పెద్ద ఆరోపణ.
ఆ మాటలు తిరిగి తిరిగి జగన్ చెవిలో పడ్డాయో, లేక మనసు మార్చుకొని జగన్ డిసైడ్ అయ్యారో తెలియదు కానీ, జగన్ రూటు మార్చారు. ఈరోజు నుంచి ప్రతి ఎంఎల్ఏను కలవడానికి డిసైడ్ అయినట్టు సీఎంఓ వార్త. మంత్రులయితే, గత 100 రోజుల్లో వాళ్ళు ఏమి చేశారు..? ప్రజల మనోగతం ఏంటి అన్న విషయాలపై చేర్చిస్తారట. అదే, ఎంఎల్ఏ, పార్టీ ముఖ్య నేతలు అయితే ప్రజా సమస్యలు, నియోజకరవర్గ విషయాలు, ప్రజల్లో సర్కారు మీద ఉన్న అభిప్రాయం సేకరిస్తారట. జగన్ ఎంత వినాలని అనుకున్నా వీళ్లు చెప్పేదే వినాలి కదా అంటున్నారు జనం. చంద్రబాబుకు కూడా లోగడ ఇలానే చుట్టూ చేరి ఏవెవో చెప్పేవారు. 90 శాతం ప్రజా సంతృప్తి.. అని మొదలెట్టేవారు. ఒక్కోసారి అది హండ్రెడ్ పర్సంట్ దాకా వెళ్లిపోయేది. బాబు గారు మురిసిపోయేవారు. చివరికి మునిగిపోయారు.
ఏది ఏమైనా జగన్ ఇప్పుడు ఓ ప్రయత్నం చేస్తున్నారు. అంతవరకు సంతోషం.. అంటున్నారు అభిమానులు. ఇక్కడ మరో ఇంపార్టెంట్ మేటర్ ఏంటంటే.. ప్రతి మీటింగులోనూ జగన్ ఆ ఎమ్మెల్యే లేదా మినిస్టర్‌కి స్పెషల్ క్లాస్ తీసుకుంటారని ‘తొలివెలుగు’ దగ్గర వున్న సమాచారం.