ఏపీ సీఎం జగన్ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తో భేటీ అయ్యారు. కర్నూల్ కు హైకోర్టు తరలించడంపై వీరిద్దరి మధ్య చర్చ నడిచింది. ఇప్పటికే ఈ విషయమై జగన్ ప్రధాని మోడీ, అమిత్ షాలను కలిసి చర్చించిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల విషయంలో ముందుకెళ్లాలని నిశ్చయించుకున్న జగన్ సర్కారు.. ఆ దిశగా ముందుకెళ్లేందుకు వేగంగా పావులు కదుపుతోంది. ఈ అంశంలో మరికొంతమంది కేంద్ర మంత్రులతో జగన్ భేటీ అయ్యే అవకాశం ఉంది.