ప్రవీణ్ ప్రకాష్… సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రభుత్వంలో చక్రాధిపత్యం నడుస్తుంది. సీఎంవో ముఖ్య కార్యదర్శిగా, జీఏడీ కీలక అధికారిగా ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆయన కనుసన్నలోనే సాగుతుంది. ప్రవీణ్ ప్రకాష్ కోసమే సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను కూడా అర్ధాంతరంగా తొలగించారు.
కానీ ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ తన బాధ్యతల నుండి తప్పుకోనున్నట్లు ప్రచారం సాగుతుంది. ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్తున్నారని ఏపీ సచివాలయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. కానీ ఆయన ఇప్పటికే కేంద్ర సర్వీసుల్లో పని చేసి వచ్చారు. చంద్రబాబు హాయంలో రాష్ట్ర సర్వీసుల్లోకి రాగా… ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా పనిచేశారు.
ఆయన మాటే శాసనంగా ఏపీలో హావా కొనసాగుతున్న దశలో ప్రవీణ్ ప్రకాష్ ఎందుకు తప్పుకుంటున్నారన్న కారణాలు మాత్రం భయటకు పొక్కటం లేదు. కానీ ఆయన స్థానంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్ రావత్ సీఎం కార్యాలయ వ్యవహరాలన్నీ చక్కపెట్టనున్నట్లు తెలుస్తోంది.