ఏ అధికారి అయినా కాస్త గట్టిగా మాట్లాడుతూ.. వాదనకు దిగితే.. వెంటనే అవతల ఉన్న అధికారి అనే డైలాగు ఏంటంటే ‘‘ఏంటీ నువ్వు ప్రవీణ్ కుమార్ లా మాట్లాడుతున్నావేంటి?’’. అదీ పరిస్ధితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేషన్ లో.
ముఖ్యమంత్రి పొలిటికల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ హవా ఆ రేంజ్ లో నడుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ తాననుకున్నవి వెంటనే జరగటం లేదని.. జీవోలు వెంటనే రావడం లేదని.. ఇంత స్లోగా అయితే ఎలా అని ఫీలై.. ఏరి కోరి ఢిల్లీలో ఏపీ భవన్ లో ఉన్న ప్రవీణ్ కుమార్ ను తీసుకొచ్చి తన పొలిటికల్ సెక్రటరీ (జీఏడీ)గా వేశారు. ఆయనకు అపరిమిత అధికారాలను కట్టబెట్టారు. ఆఖరుకు చీఫ్ సెక్రటరీ కూడా ఆయన కిందే అన్నట్లు చేసేసి.. ఎల్వీ సుబ్రమణ్యం వెళ్లిపోవడానికి కారణమయ్యారు. అయినా ప్రవీణ్ ప్రకాష్ అధికారం ఎక్కడా చెక్కు చెదరలేదు.
ప్రభుత్వ ప్రాధాన్యత అంతా నవరత్నాలకే అవడం.. మరోవైపు ఖజానాలో కాసులు లేకపోవడంతో.. అడ్మినిస్ట్రేషన్ లో నానా గందరగోళం నడుస్తుంది. మినిమమ్ ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం లేదని చాలా డిపార్ట్ మెంట్లకు సంబంధించిన అధికారులు వాపోతున్నారు. వారు రూల్స్ మాట్లాడి.. గట్టిగా నిలదీస్తే.. వారికి అవతలి నుంచి ప్రవీణ్ కుమార్ పేరు వినపడుతోంది. ‘‘ఆయన ఆపేయమన్నారండి. తర్వాత చూద్దామన్నారండి‘‘ ఇదీ తంతు.
ఆ ఐఏఎస్ ఆఫీసర్ కు 28 ఏళ్లలో 53 వ ట్రాన్స్‌ఫర్..!
ఎవరైనా వాదనకు దిగారా.. వాళ్లకు ప్రవీణ్ కుమార్ క్లాసు ఓ రేంజ్ లో తీసుకుంటున్నారంట. రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ అయితే.. అధికారులకు మాత్రం సీఎం ప్రవీణ్ కుమారేనని చెప్పుకుంటున్నారు.
దీంతో అధికారులు తలల పట్టుకుంటున్నారు. ఒక డిపార్ట్ మెంట్ లో అయితే కేవలం రు.10 కోట్ల బడ్జెట్ గురించి నానా తంటాలు పడుతున్నారు. అవి రాష్ట్రం నిధులు కూడా కావు. కేంద్రం నుంచి వచ్చినవి. అవి ఏ పర్పస్ కు వచ్చాయో.. వాటికే వాడాలని ఆ డిపార్ట్ మెంట్ హెడ్ నెత్తి నోరు బాదుకుని చెబుతున్నా.. పై నుంచి నిధులను వదలటం లేదంట. మేం చెప్పినప్పుడు ఖర్చు పెడుదురుగాని.. అని సమాధానమిస్తున్నారు. అయ్యా స్వామీ.. అవి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పెట్టిన స్కీము.. అందుకే కేంద్రం నిధులిచ్చింది.. వాటి ప్రకారం చేయకపోతే చిక్కుల్లో పెడతామని విన్నవించుకుంటే.. మాకు తెలుసులే.. మేం చూసుకుంటాంలే అనే సమాదానం సీఎంఓ నుంచి వచ్చిందని.. ఆ అధికారి క్రిందిస్థాయివారితో మొరపెట్టుకుంటన్నారంట.
ఆర్టీసీపై కేసీఆర్ ఆటలకు గడ్కరీ చెక్!
కేంద్ర పథకం అయినా.. ఏ స్కీమ్ అయినా సరే.. మొత్తం నవరత్నాల అమలుకే తరలిస్తున్నారు. దీంతో రోజువారీ ఖర్చులకు సైతం నిధులు లేక ప్రభుత్వ అధికారులు ఆయా శాఖల్లో ఇబ్బందులు పడుతున్నారు. కాని ముఖ్యమంత్రి గారి ఆదేశం.. ప్రవీణ్ కుమార్ గారి సందేశం.. ఇక ఆపుకో నీ ఆవేశం అంటూ జోకులు వేసుకుంటున్నారంట. మరి ఈ అడ్మినిస్ట్రేషన్ ఎప్పటికి దారిలో పడుతుందో.. రేపు నవరత్నాలకు డబ్బులు లేని పరిస్ధితి వస్తే ఏం చేస్తారో అర్ధం కాక.. అధికారులు దేవుడిపై .. అదే ప్రవీణ్ కుమార్ పై భారం వేసి రోజులు గడిపేస్తున్నారు. అదీ సంగతి.