ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఉన్నత విద్యా విధానంపై ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మూడేళ్లు, నాలుగేళ్ల డిగ్రీ కోర్సుల్లో 10 నెలల పాటు అప్రెంటిస్‌షిప్ సదుపాయం, ఆపై మరో ఏడాది పాటు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పించే కోర్సుల బోధన ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు.
ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఆనర్స్ డిగ్రీ చేపట్టాలన్నారు. అలాగే అక్టోబర్ 15 నుంచి కళాశాలలు తెరచుకోనున్నాయని వెల్లడించారు. సెప్టెంబర్‌లో సెట్ పరీక్షలు చేపట్టాలని సూచించారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో యూనివర్సిటీలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక అక్రమాలకు పాల్పడే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.