ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా బ్యాన్ చేయడంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు మండిపడితున్నారు. అయితే ఏపీ నేతలు కాస్త వెరైటీగా ఆలోచించారు. కాంగ్రెస్ నేత హర్షకుమార్ అనుచరులు ట్విట్టర్ బర్డ్ ను వేపుడు చేసి ఢిల్లీలోని ట్విట్టర్ ఇండియా ఆఫీస్ కు స్పీడ్ పోస్ట్ పార్శిల్ చేశారు.
భవిష్యత్ ప్రధాని ఖాతాను నిలిపివేసి ట్విట్టర్ నిర్వాహకులు పెద్ద తప్పు చేశారని అన్నారు కాంగ్రెస్ నాయకులు. అంతేకాకుండా కాంగ్రెస్ ట్వీట్లను ప్రమోట్ చేయడం లేదని ఆరోపించారు. బీజేపీ కుట్రలో భాగంగానే కాంగ్రెస్ నేతల అకౌంట్స్ బ్యాన్ చేశారని అన్నారు.